నస్రుల్లాబాద్, జూన్ 12: అప్పు చెల్లించడం లేదని రైతుల భూముల ను వేలానికి పెట్టిన ఉదంతం కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం నాచుపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కీసరి అంజలి, కీసరి పోచవ్వ 2016లో 143 గుంటల భూమిని తనఖాపెట్టి ప్రాథమిక సహకార సంఘంలో రూ.5 లక్షల దీర్ఘకాలిక రుణం తీసుకున్నా రు.
అప్పు చెల్లించడం లేదంటూ సొసైటీ, నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధికారులు సదరు రైతుల భూమిని వేలం వేయాలని నిర్ణయించారు. ఇప్పటివరకు అసలు, వడ్డీ, ఇతర ఖర్చులు సహా రూ.9.47 లక్షల బకాయి పేరుకుపోయిందని తెలిపారు. సదరు భూములను వేలం వేయనున్నట్టు గురువా రం వాట్సాప్ గ్రూపుల్లో కరపత్రాన్ని బ్యాంకు సిబ్బంది పంపించారు.