మైనింగ్‌లో రూ.300 కోట్ల అక్రమాలు
మైనింగ్ పేరుతో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంచలన ఆరోపణలు చేసింది.
- ఎమ్మెల్యేపై ఈడీ సంచలన ఆరోపణ
- రూ.19 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటన
హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ) : మైనింగ్ పేరుతో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంచలన ఆరోపణలు చేసింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఉన్న ఎమ్మెల్యే, ఆయన తమ్ముడు మధుసూదన్‌రెడ్డి ఇండ్లు, ఆఫీసులపై మనీలాండరింగ్, హవాలా అనుమానాల నేపథ్యంలో ఈడీ సోదాలు జరిపిన విషయం విదితమే. మైనింగ్ పేరుతో రూ.300 కోట్లమేర అక్రమాలు జరిగాయని, ప్రభుత్వానికి రూ.39 కోట్లు నష్టం చేకూర్చారని ఈడీ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
బ్యాంక్ అకౌంట్లలో అక్రమ లావాదేవీలను గుర్తించామని, అక్రమ మార్గంలో కూడబెట్టిన డబ్బుతో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టారని తెలిపారు. సోదాల సందర్భంగా రూ.19 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. బినామీల పేర్లతో లావాదేవీలను గుర్తించామని, కొన్ని బ్యాంక్ లాకర్స్‌ని తెరవాల్సి ఉందని తెలిపింది. పెద్ద సంఖ్యలో ఆస్తి పత్రాలు, లెకల్లో చూపని నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నగదుకు సంబంధించిన ఆధారాలు ఉన్న మొబైల్ ఫోన్లను సీజ్ చేశామన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
చెకుముకి సైన్స్ సంబురాలు-2026 పోస్టర్ ఆవిష్కరణ
Narnoor | గోవర్ధన్ గుట్టపై ఆదివాసుల సాంప్రదాయ పూజలు
Women Professor | వీసీ అల్డాస్ జానయ్య వేధింపులకు మరో మహిళా ప్రొఫెసర్ కంటతడి.. వీడియో
Cop Dies After Pushed | పటాకులు కాల్చడంపై వాగ్వాదం.. పోలీస్ అధికారిని తోసేయడంతో మృతి
‘యూత్ డిక్లరేషన్ హామీలు అమలు చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

