జనగామ, మే 19 (నమస్తే తెలంగాణ) : జనగామ నియోజకవర్గ కాంగ్రెస్‌లో డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, భువనగిరి ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి మధ్య వర్గపోరు తీవ్రమవుతున్నది. చేర్యాల మాజీ ఎమ్మెల్యే నాగపురి రాజలింగం కుమారుడు కిరణ్‌కుమార్ గౌడ్ నియోజకవర్గంలోని పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంజూరు చేయించి ఆయా గ్రామాలకు వెళారు. లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తున్నారు. డీసీసీ అధ్యక్షుడిగా నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిని కాదని కిరణ్‌కుమార్ చెక్కులు పంపిణీ చేయడం ఆయన వర్గీయులకు మింగుడుపడలేదు. తాజాగా సోమవారం జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో సీఎం, ఎంపీ సహకారంతో జనగామ, నర్మెట, తరిగొప్పుల, బచ్చన్నపేట, దూల్మిట్ట, చేర్యాల మండలాలకు 24 మందికి మంజూరైన రూ.10లక్షల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేస్తున్నట్టు ప్రకటించారు. చెక్కులు అందుకునేందుకు లబ్ధిదారులు పెద్దఎత్తున చేరుకోగా.. తమ నాయకుడు కొమ్మూరికి సమాచారం లేకుండా పోటీగా కార్యక్రమాలు నిర్వహించడం ఏమిటని ఆయన వర్గీయులు కిరణ్ కుమార్ చెక్కుల పంపిణీని అడ్డుకొని గొడవకుదిగారు.
గాయత్రి గార్డెన్లో చెక్కుల పంపిణీ చేసేందుకు నాగపురి వర్గీయులు సిద్ధపడగా.. అక్కడ కూడా అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాలను చెదరగొట్టి నాగపురి కిరణ్‌కుమార్‌ను అక్కడి నుంచి పంపించివేయడంతో గొడవ సద్దుమణిగింది. శామీర్‌పేటలోని మాజీ ఎంపీటీసీ మహేందర్ ఇంటి వద్ద నాగపురి కిరణ్ చెక్కుల పంపిణీ పూర్తిచేశాడు. బచ్చన్నపేట మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నూకల బాల్‌రెడ్డి డబ్బులు డిమాండ్ చేశాడని..లేవని చెప్పడంతో చెక్కు ఇవ్వకుండా వెళ్లిపోయారని కొన్నెకు చెందిన కరోళ్ల జ్యోతితో కొమ్మూరి వర్గానికి చెందిన జనగామ మార్కెట్ కమిటీ చైర్మన్ శివరాజ్ యాదవ్ జనగామ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయించాడు.
మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గడ్డం వివేక్ ముందే కాంగ్రెసోళ్లు కొట్టుకున్నరు. సంస్థాగత ఎన్నికల పరిశీలకులు రాఘవరెడ్డి, రాంభూపాల్ పాల్గొన్నారు. పదవుల కోసం నేతల పేర్లు ప్రస్తావిస్తుండగా, ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు, షాడో ఎమ్మెల్యే వర్గం, మరో వర్గం గొడవకు దిగారు.
-చెన్నూర్ రూరల్
బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్లో సోమవారం మీడియా సమావేశం నిర్వహించేందుకు వచ్చిన అంబటి కృష్ణమూర్తి, నాయకులపై సంజీవరెడ్డి వర్గానికి చెందిన ఐఎన్టీయూసీ నేతలు చంద్రశేఖర్, ఆదిల్ షరీఫ్ , నరసింహారెడ్డి దాడిచేశారు. పోలీసులు సంజీవరెడ్డి వర్గీయులను తరిమికొట్టారు. కృష్ణమూర్తి ఆబిడ్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
-రవీంద్రభారతి