భూదాన్‌పోచంపల్లి: దేశం గర్వించదగ్గ చేనేత కార్మికులు మన రాష్ట్రంలో ఉండటం ఆనందంగా ఉందని రాష్ట్ర ఐటీ చేనేత జౌళీ శాఖ మంత్రి కేటీ ఆర్ అన్నారు. భూదాన్‌పోచంపల్లికి చెందిన తడక రమేశ్, పోచంపల్లికి చెందిన యువ కళాకారులు సాయిని భరత్‌లు ప్రభుత్వ మెరిట్ సర్టిఫికెట్ అవార్డుకు ఎంపిక కాగా వారు రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను సోమవారం అసెంబ్లీలో ని ఆయన ఛాంబర్లో కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ వారిని అభినందించారు. వారిని ఘనంగా సత్కరించారు.
చేనేత కళను బతికించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళుతుందని అందుకే చేనేతను బతికించుకోవడానికి అనేక పథకాలను ప్రవేశ పెడుతున్నామని కేటీఆర్ అన్నారు. చేనేత కార్మికుల సంక్షమానికి తాము ఎప్పుడూ కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు. కేటీఆర్‌ను కలిసిన వారిలో టీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి కర్నాటి విద్యాసాగర్, చేనేత దినోత్సవ రూపకర్త ఎర్రమాద వెంకన్న తదితరులు ఉన్నారు.