హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ ధరల పెరుగుదల ప్రభావం నిత్యావసర, ఇతర వస్తుసేవలపైనా పడింది. అన్నింటి ధరలు పెరగటంతో జీవన వ్యయం పెరిగింది. ఈ నేపథ్యంలో జీవన వ్యయంపై ఈవై ప్యూచర్ కన్జ్యూమర్ ఇండెక్స్ ఫర్ ఇండియా సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో చాలామంది ఇంటి అవసరాలకు అయ్యే ఖర్చులను తగ్గించుకొంటున్నామని, తక్కువ ధర ఉన్న వస్తువులను కొంటున్నామని తెలిపారు. భవిష్యత్తు హెల్త్ అండ్ వెల్నెస్ దృష్ట్యా హెల్త్ ప్రీమియంలు ఎక్కువగా చెల్లిస్తున్నామని వెల్లడించారు. భారత్తో పాటు మరో 23 దేశాల్లో 18 వేల మందిని సర్వే చేసిన ఈవై ప్యూచర్ కన్జ్యూమర్.. ఆ వివరాలను పేర్కొన్నది.