హైదరాబాద్, జనవరి31 (నమస్తే తెలంగాణ): బీసీలను ‘ఇతరులు’ (ఆదర్స్)గా ముద్ర వేసే రాజకీయ కుట్రకు కేంద్రం తెరలేపిందని, ఇది సామాజిక న్యాయానికి తూట్లు పొడిచే చర్య అని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వ య జేఏసీ చైర్మన్ దుండ్ర కుమారస్వామి ఆందోళన వ్యక్తంచేశారు. అందుకే కేంద్రం జనగణన- 2027 కోసం జారీచేసిన నోటిఫికేషన్లో ఓబీసీ కాలమ్‌ను ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు.
ఇంటి నిర్మాణం ఏ పదార్థంతో ఉన్నదో? ఎన్ని గదులున్నాయో? టీవీ, మొబైల్, ఇంటర్నెట్ ఉన్నాయా? వంటి ప్రశ్నలు పెట్టిన కేంద్రం.. బీసీలపై మాత్రం స్పష్టమైన కుల వివరాల సేకరణకు ప్రశ్నలను పెట్టనేలేదని విమర్శించారు. ఇది బీసీల సామాజిక న్యాయంపై ప్రత్యక్ష దాడి అని ఆరోపించారు. కేంద్రం చర్యలను బీసీ, కుల సంఘాలు, మేధావులు ఖండించాలని పిలుపునిచ్చారు. ఇండ్ల గుర్తింపు నోటిఫికేషన్లోనూ ఓబీసీ కాలమ్ చేర్చాలన్నారు.