హైదరాబాద్, జూలై17 (నమస్తే తెలంగాణ): గురుకులాల కామన్ టైంటేబుల్‌ను సవరించాలని తెలంగాణ గవర్నమెంట్ ఆల్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్(టిగారియా) ప్రభుత్వాన్ని కోరింది. సెంట్రల్ యూనియన్ జనరల్ సెక్రటరీ మధుసూదన్, వర్కింగ్ ప్రెసిడెంట్ జనార్దన్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్న్ను కలిసి వినతిపత్రం అందజేశారు.
గతంలో మాదిరిగా గురుకుల టైంటేబుల్‌ను 9 గంటలకు సవరించాలని కోరారు. ఎస్సీ గురుకుల సొసైటీ చైర్మన్ అప్పిలేట్ అథారిటీ పవర్స్‌ను పునరుద్ధరించాలని, ప్రిన్సిపాల్ ప్రమోషన్లను 100శాతం ఇన్ సర్వీస్ వారికి కేటాయించాలని, జోనల్, డిప్యూటీ సెక్రటరీ పదోన్నతుల్లో స్త్రీ, పురుష నిష్పత్తి పాటించాలని, బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.