ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 9: యూనివర్సిటీలలో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లును గవర్నర్ తమిళిసై తక్షణమే ఆమోదించాలని టీఆర్ఎస్వీ ఓయూ ఇన్చార్జి కొంపెల్లి నరేశ్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ గవర్నర్ కేంద్రప్రభుత్వ తొత్తుగా వ్యవహరిస్తూ, అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిన బిల్లును తొక్కిపెట్టి, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడం దురదృష్టకరమన్నారు.
తక్షణమే ఈ బిల్లును ఆమోదించకుంటే12న ప్రధాని పర్యటనను అడ్డుకొంటామని, అన్ని విద్యార్థి సంఘాలతో కలిసి రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. విద్యా ర్థి నాయకులు గణేశ్, ప్రసన్న, చారి,ప్రదీప్,సతీశ్,వెంకట్ పాల్గొన్నారు.