హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): 2.86 కోట్ల సామ్లో 14 ఏండ్లుగా తప్పించుకొని తిరుగుతున్న దంపతులను అదుపులోకి తీసుకున్నట్టు సీఐడీ పోలీసులు సోమవారం వెల్లడించారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో కన్యకాపరమేశ్వరి కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో కొందరు బోర్డు డైరెక్టర్లు, ఉద్యోగులు కలిసి బినామీ పేర్ల మీద రుణాలు తీసుకొని సుమారు రూ.2,86,40,000 మోసానికి పాల్పడ్డారు.
14 ఏండ్ల క్రితం నమోదైన కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు. తాజాగా ఈ సాంతో సంబంధం ఉన్న ఏ15 కాకర్లపూడి కృష్ణవర్మ, బ్యాంకు ఉద్యోగి అయిన అతని భార్య ఏ3 పద్మ అలియాస్ రూపను వైజాగ్‌లోని గాజువాకలో అరెస్టు చేశారు. వీరిపై 2016లోనే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. కేసులో కీలకంగా వ్యవహరించిన వారిని సీఐడీ చీఫ్ అభినందించారు.