ప్రజారోగ్యం పట్టని కేంద్రం
వైద్యరంగానికి కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ మొండిచెయ్యి చూపింది. మొత్తం జాతీయ వ్యయంలో కేవలం 1.96శాతమే కేటాయించింది. దేశంలో ప్రస్తుతం నమోదవుతున్న మరణాల్లో 75% ఎన్సీడీ(నాన్-కమ్యూనికబుల్ వ్యాధుల) కారణంగా సంభవిస్తుండగా, వాటి నివారణ, నియంత్రణకు బడ్జెట్లో కేటాయించిన 2% ఏమాత్రం సరిపోద ని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
- వైద్యరంగానికి 1.96 శాతమే ..
- వ్యాధి నివారణ చర్యలేవీ?
- ‘ఔట్ ఆఫ్ ప్యాకెట్ బర్డెన్’తో పేదరికం
- మందుల ధరలపై నియంత్రణేది?
- హెల్త్‌కు 3% బడ్జెట్ కేటాయించాలని వైద్య నిపుణుల డిమాండ్
హైదరాబాద్, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ) : వైద్యరంగానికి కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ మొండిచెయ్యి చూపింది. మొత్తం జాతీయ వ్యయంలో కేవలం 1.96శాతమే కేటాయించింది. దేశంలో ప్రస్తుతం నమోదవుతున్న మరణాల్లో 75% ఎన్సీడీ(నాన్-కమ్యూనికబుల్ వ్యాధుల) కారణంగా సంభవిస్తుండగా, వాటి నివారణ, నియంత్రణకు బడ్జెట్లో కేటాయించిన 2% ఏమాత్రం సరిపోద ని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
పెరుగుతున్న వ్యాధుల భారం, బడ్జెట్ ప్రాధాన్యతలకు మధ్య అసమతుల్యతను స్పష్టం చేస్తున్నదని అంటున్నారు. చికిత్స కన్నా నివారణపై దృష్టిసారించాల్సిన కేంద్రం, కేవలం విధాన ప్రకటనలకే పరిమితం అవుతున్నదని అభిప్రాయపడుతున్నారు. బడ్జెట్ లో ప్రజారోగ్యం, జీవనశైలి మార్పులు, ప్రా రంభ దశ స్క్రీనింగ్, నివారణ చర్యల కన్నా దవాఖాన కేంద్రిత, బీమా ఆధారిత మోడల్‌కే ప్రాధాన్యమివ్వడం విమర్శలకు తావిచ్చింది.
అడ్డగోలు ధరలతో రోగులపై పెనుభారం
బడ్జెట్లో మందుల నియంత్రణకు ఎలాం టి సంస్కరణలు చేపట్టలేదు. మందులు, డయాగ్నోస్టిక్‌లకు రోజువారీ అయ్యే ఖర్చు అధికమై ఓపీడీ(ఔట్ ఆఫ్ పాకెట్ బర్డెన్) పెరుగుతున్నదని, ఈ పరిణామం పేదరికానికి దారితీస్తున్నదని హెచ్చరిస్తున్నారు. ఆశలు, ఏఎన్ఎం, కమ్యూనిటీ హెల్త్ సిబ్బంది జీతాల పెంపుపై ఊసేలేదు.
2.5-3% కేటాయించాలి
దేశ జీడీపీలో 2.5-3% ఆరోగ్యరంగానికి కేటాయించేలా కేంద్రం రోడ్డు మ్యాపును ప్రకటించాలి. నేషనల్ హెల్త్ మిషన్‌కు నిధుల కేటాయింపుల్లో ఆలస్యం చేయొద్దు.
– డాక్టర్ రంగారెడ్డి, ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pawan Kalyan | చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు రోడ్లపైకి వచ్చింది జనసైనికులే!.. కూటమిలో జనసేనదే ఎక్కువ త్యాగం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

