RRB | ఫలించిన మాజీ ఎంపీ వినోద్ కుమార్ కృషి.. ఇకపై గ్రామీణ బ్యాంకులన్నీ ఒకే గొడుగు కిందకు!
RRB | నాబార్డు పరిధిలోని రీజినల్ రూరల్ బ్యాంకులన్నింటినీ కలిపి తెలంగాణ స్టేట్ గ్రామీణ బ్యాంకుగా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది.
RRB | హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): నాబార్డు పరిధిలోని రీజినల్ రూరల్ బ్యాంకులన్నింటినీ కలిపి తెలంగాణ స్టేట్ గ్రామీణ బ్యాంకుగా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. 2025 జనవరి నుంచి అందుబాటులోకి తీసుకురావాలని నాబార్డుకు ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగు రాష్ర్టాల్లోని ఆర్ఆర్బీలన్నింటినీ ఒకే పెద్ద బ్యాంకుగా ఏర్పాటు చేసేందుకు మాజీ ఎంపీ వినోద్‌కుమార్ చేసిన కృషి ఫలించింది. ఈ మేరకు తన విజ్ఞప్తులకు స్పందించిన కేంద్ర ప్రభుత్వానికి మంగళవారం వినోద్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
ఆర్ఆర్బీలు 950పైగా శాఖ లు, 17 ప్రాంతీయ కార్యాలయాలతో రాష్ట్రంలో అతిపెద్ద నెట్‌వర్క్‌ను కలిగి ఉన్నాయి. 2014లో రాష్ట్ర విభజన నాటి నుంచి ఈ సమస్య పెండింగ్‌లోనే ఉన్నది. 2024 అక్టోబర్‌లో ఆస్తులు, అప్పుల విభజనకు రెండు తెలుగు రాష్ర్టాలు సమ్మతించడంతో తెలంగాణ స్టేట్ గ్రామీణ బ్యాంకు ఏర్పాటుకు మార్గం సుగమమైంది. దశాబ్దకాలంగా వినోద్‌కుమార్ ఈ సమస్యను పార్లమెంట్లో లేవనెత్తడంతోపాటు డీఎఫ్ఎస్ కార్యదర్శిని కలిసి విన్నవించారు. బ్యాంకు యూనియన్లు నిర్వహించిన సమావేశాలు, ధర్నా ల్లో పాల్గొన్నారు. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పలుమార్లు వినతులు సమర్పించారు. దీంతో రాష్ట్రం మొత్తానికి ఒకే గ్రామీణ బ్యాంకు ఏర్పాటు చేయాలని కేంద్రం నాబార్డుకు సూచించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

