హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఖాళీ కానున్న రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ ప్రకటించింది. త్వరలో ఖాళీ కానున్న హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంతోపాటు మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నది. ఇందుకు సంబంధించి ఈ నెల 16న నోటిఫికేషన్ జారీ చేయనున్నది. నామినేషన్స్ స్వీకరణకు ఈ నెల 23 వరకు అవకాశం కల్పించింది. మార్చి 13న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటలవరకు పోలింగ్ నిర్వహించనున్నది. 16వ తేదీన ఓట్లను లెక్కించి, ఫలితాలు వెల్లడించనున్నది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ స్థానానికి ఎమ్మెల్సీగా ఉన్న కాటేపల్లి జనార్దన్‌రెడ్డి పదవీకాలం మార్చి 29న ముగియనుండగా, హైదరాబాద్ స్థానిక సంస్థల తరుఫున ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్న సయ్యద్ హసన్ జాఫ్రీ పదవీ కా లం మే 1తో ముగియనున్న ది. ఈ నేపథ్యం లో ఈ రెండు స్థానాల భర్తీకి ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘ నిర్ణయించింది.