జోగులాంబ గద్వాల : జోగులాంబ గద్వాల(Jogulamba Gadwala) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీ కొన్న(Bike collided) ప్రమాదంలో ఒకరు మృతి(Man died,) చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన ధరూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ధరూర్ మండలం అల్వాల్ పాడు గ్రామానికి చెందిన రమేష్ (26) అదే గ్రామానికి చెందిన రాము బైక్పై వెళ్తూ ధరూర్ మండల కేంద్రంలోని ఓ పెట్రోల్ బంక్ సమీపంలో ఎదురెదురుగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో రమేష్ అక్కడకక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడ్డ రామును చికిత్స నిమిత్తం గద్వాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. రమేష్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.