తిమ్మాపూర్, అక్టోబర్ 16: కరీంనగర్ జిల్లా మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వాయిస్‌తో కూడిన ఓ ఆడియో సోషల్ మీడియాలో గురువారం వైరల్‌గా మారింది. ఇటీవలి కాలంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఎపిసోడ్ హాట్‌గా మారిన నేపథ్యంలో ఎమ్మెల్యేను మాజీ ఎమ్మెల్యే తిడుతున్న ఓ ఆడియో సోషల్ మీడియాలో రావడంతో కలకలం రేపింది.
ఆడియో వైరల్ అయిన నేపథ్యంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ పోలీస్ సేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై పలు ఐటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.