హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లకు సంబంధించిన ఏప్రిల్ నెల కోటాను ఈనెల 19న ఉ దయం 10 గంటలకు ఆన్లైన్లో వి డుదల చేయనున్నట్టు టీటీడీ ఆదివా రం ప్రకటనలో వెల్లడించింది. ఈ-సేవ టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం 21 న ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని తెలిపింది. టికెట్లు పొందిన వారు 21 నుంచి 23 మధ్యాహ్నం 12 గంటలలోపు నగదు చెల్లిస్తే టికెట్లు మంజూరవుతాయని పేర్కొన్నది. 22న ఉద యం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, శ్రీవారి సా లకట్ల వసంతోత్సవాల టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు వెల్లడించింది. 22న మధ్యాహ్నం 3 గం టలకు వర్చువల్ సేవలు, వాటి దర్శ న స్లాట్ల కోటాను ఆన్లైన్లో విడుద ల చేస్తామని తెలిపింది.
అంగ ప్రదక్షి ణ టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 23న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని వివరించింది. 23 మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచి త ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు తెలిపింది. ప్రత్యేక ప్రవేశ దర్శన టికె ట్ల కోటాను 24న ఉదయం 10గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తామని పేర్కొన్నది. మార్చికి సంబంధించిన శ్రీవారి సేవ, పరకామణి సేవా కోటా ను 27న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తామని వివరించింది. https://ttdevasthanams.ap.gov. in వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది.