హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ శాఖ కొత్తగా ‘క్రాప్ దర్పణ్’ అనే మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిని ఐఐటీ హైదరాబాద్‌తో కలిసి సంయుక్తంగా రూపొందించింది. వ్యవసాయ విస్తరణ, అధికారులు, ఏడీఏల విధులను ఇందులో పొందుపర్చింది.
శనివారం వ్యవసాయ యూనివర్సిటీలో అవగాహన కల్పించింది. యాప్ పని తీరుతో పాటు ఇంకా ఏమైనా పొందుపర్చాల్సిన సమాచారంపై అధికారులతో చర్చించింది.