హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ) : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధి కోసం రూ.500 కోట్లు ప్రత్యేక నిధులు కేటాయించాలని బోధన, బోధనేతర ఉద్యోగ సంఘాల నేతలు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరారు.
బుధవారం మంత్రితో సమావేశమైన సంఘాల ప్రతినిధులు.. ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు.