సోమవారం 13 జూలై 2020
Telangana - Jun 19, 2020 , 01:38:22

ఆదరించండి.. అవమానించకండి

ఆదరించండి.. అవమానించకండి

  • కష్టకాలంలో కుటుంబాలకు దూరంగా పనిచేస్తున్నాం
  • సమావేశంలో కంటతడి పెట్టిన ఆశ కార్యకర్తలు

ఎల్లారెడ్డిపేట: ‘నేను ఆశ కార్యకర్తను.. సీజనల్‌ వ్యాధులు రాకుండా ముందుగా అప్రమత్తం చేసే సామాజిక కార్యకర్తను.. ఇంటింటికీ తిరిగి మందులిచ్చి, అన్నీ కనిపెట్టుకొని పనిచేసే సంరక్షకురాలిని. కరో నా కష్టకాలంలోనూ ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్నాం. సమాజం కోసం పాటుపడుతున్న మమల్ని ఆదరించండి.. అవమాననించకండి’ అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లికి చెందిన ఆశ కార్యకర్త గోవర్ధన గీత కన్నీటి పర్యంతమైంది. కుటుంబాలకు దూరంగా ఉంటూ పనిచేస్తుంటే అర్థం చేసుకోకపోగా ఊళ్లోని ప్రజలు ద్వేషిస్తున్నారని, అమర్యాదగా మాట్లాడుతున్నారంటూ’ గురువారం ఎల్లారెడ్డిపేటలో జరిగిన ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తల సమావేశంలో ఆమె గోడువెళ్లబోసుకోగా అక్కడున్న వారంతా కంటతడి పెట్టారు.


logo