హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీలో నేడు సమ్మె సైరన్ మోగనున్నది. ఎలక్ట్రిక్ బస్సుల విధానాన్ని పునః సమీక్షించి, సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌తో సమ్మెకు వెళ్లాలని నిర్ణయించినట్టు ఆర్టీసీ జేఏసీ పేర్కొన్నది.
సోమవారం సాయంత్రం 4 గంటలకు బస్‌భవన్‌లో యా జమాన్యానికి సమ్మె నోటీసు అందజేయనున్నట్టు జేఏసీ చైర్మన్ ఈ వెంకన్న, వైస్ చైర్మన్ ఎం థామస్‌రెడ్డి, కన్వీనర్ మౌలానా, కో-కన్వీనర్లు వెల్లడించారు.