హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. 35 గురుకులాల్లో మే 10న టీజీఆర్జేసీ సెట్ పరీక్షను నిర్వహించారు. 61,476 మంది పరీక్షకు హాజరయ్యారు.
గ్రూపులవారీగా మార్కులు, ర్యాంక్ జాబితాను http://tgrjccet.cgg.gov.in వెబ్సైట్లో పొందుపరిచారు. ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా కోర్సుల్లో సీట్లు కేటాయిస్తామని తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి సీహెచ్ రమణకుమార్ తెలిపారు.