TGPSC | హైదరాబాద్ : గ్రూప్స్ ఫలితాల వెల్లడికి టీజీపీఎస్సీ తేదీలను ఖరారు చేసింది. ఈ నెల 10వ తేదీన గ్రూప్-1 ఫలితాలను వెల్లడించనుంది. 10 నుంచి 18వ తేదీ మధ్య గ్రూప్-1, 2, 3 ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
గ్రూప్-2 ఫలితాలకు సంబంధించి 11వ తేదీన జనరల్ ర్యాంకింగ్ జాబితా ప్రకటించనున్నారు. గ్రూప్-3 ఫలితాలకు సంబంధించి 14న జనరల్ ర్యాంకింగ్ జాబితా విడుదల చేయనున్నారు. ఈ నెల 17న హాస్టల్ వెల్ఫేర్ తుది ఫలితాలను, 19న ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఫైనల్ ఫలితాలను ప్రకటించనున్నట్లు టీజీపీఎస్సీ అధికారులు వెల్లడించారు.