‘ఏఈఈ’ని వాయిదా వేయాల్సిందే
ఒకే రోజు రెండు పరీక్షలు ఉన్నందున వచ్చే నెల 6న టీజీపీఎస్సీ ఆర్అండ్బీ ఏఈఈ పరీక్షను వాయిదా వేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదే రోజు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఎస్సెస్సీ జేఈ పరీక్ష ఉండటంతో 50వేల మంది అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని సోమవారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఎస్సెస్సీ బోర్డు ఇప్పటికే పరీక్ష తేదీని నిర్ణయించి వెబ్సైట్లో షెడ్యూల్‌ను విడుదల చేసిందని గుర్తుచేశారు.
- నవంబర్ 6న ఎస్సెస్సీ జేఈ పరీక్ష
- ఒకేరోజు రెండు పరీక్షల నిర్వహణతో అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన
- బీఆర్ఎస్ నేత హరీశ్ డిమాండ్‌తో మరుసటి రోజుకు పరీక్ష వాయిదా
హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : ఒకే రోజు రెండు పరీక్షలు ఉన్నందున వచ్చే నెల 6న టీజీపీఎస్సీ ఆర్అండ్బీ ఏఈఈ పరీక్షను వాయిదా వేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదే రోజు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఎస్సెస్సీ జేఈ పరీక్ష ఉండటంతో 50వేల మంది అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని సోమవారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఎస్సెస్సీ బోర్డు ఇప్పటికే పరీక్ష తేదీని నిర్ణయించి వెబ్సైట్లో షెడ్యూల్‌ను విడుదల చేసిందని గుర్తుచేశారు.
రెండు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇప్పటికే పలుమార్లు మంత్రులు, టీజీపీఎస్సీ అధికారులకు మొరపెట్టుకున్నా, సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేసినా కనీస స్పందన లేకపోవడం బాధాకరమని మండిపడ్డారు. సీఎం తక్షణమే ఏఈఈ పరీక్షను వాయిదా వేసి అభ్యర్థులు రెండు పరీక్షలు రాసేలా వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేశారు. కాగా హరీశ్‌రావు డిమాండ్‌తో స్పందించిన టీజీపీఎస్సీ ఏఈఈ పరీక్షను నవంబర్ 7వ తేదీకి వాయిదా వేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

