హైదరాబాద్, సెప్టెంబర్ 21(నమస్తే తెలంగాణ): రెవెన్యూశాఖలో పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని టీజీవో ప్రభుత్వాన్ని కోరింది.టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం శనివారం సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి,
రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి నవీన్‌మిట్టల్‌ను కలిసి పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఎనుగుల సత్యనారాయణ, శ్యామ్, ఉపేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.