రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో డీఏ విడుదల!
TS Govt | రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త వినిపించారు. ప్రభుత్వ ఉద్యోగులకు బకాయి ఉన్న డీఏ విడుదలకు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారని, వెంటనే విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లు టీజీవో

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త వినిపించారు. ప్రభుత్వ ఉద్యోగులకు బకాయి ఉన్న డీఏ విడుదలకు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారని, వెంటనే విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లు టీజీవో అధ్యక్షురాలు మమత, ప్రధాన కార్యదర్శి ఎ సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగుల తరపున ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం చైర్మన్, వ్యవస్థాపక అధ్యక్షులు, మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ను ప్రగతి భవన్లో టీజీవో అధ్యక్షులు, ఇతర ఉద్యోగులు కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సీఎంతో చర్చించారు.
త్వరలోనే ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు
జోనల్ వ్యవస్థలో ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏర్పడే ఖాళీలకు, త్వరలోనే ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు విడుదల చేస్తామని సీఎం చెప్పినట్లు టీజీవోలు పేర్కొన్నారు. ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు సహకరించాలని సీఎం కోరినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ కృషి వల్లనే నిరుద్యోగులకు 95 శాతం ఉద్యోగాలు దక్కనున్నాయి అని టీజీవోలు స్పష్టం చేశారు.
సీఎంను కలిసిన వారిలో రాష్ట్ర సహ అధ్యక్షులు సహదేవ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఎంబీ కృష్ణాయాదవ్, నగర శాఖ అధ్యక్షులు జీ వెంకటేశ్వర్లు, కేంద్ర కార్యదర్శి బి వెంకటయ్య, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Satyavathi Rathod | సత్యవతి రాథోడ్‌కు కేటీఆర్ బర్త్ డే విషెస్.. వీడియో
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
GLP-1 Medicine | మార్కెట్లో కుప్పలు కుప్పలుగా కల్తీ జీఎల్పీ-1 మందులు.. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరికలు..
Cult | విశ్వక్ సేన్ ‘కల్ట్’ ఫస్ట్ డే కలెక్షన్లు.. భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచిందా, బ్రేక్ ఈవెన్‌కు ఎంత రావాలంటే?
Conrad Star Hotel: బెంగుళూరు ఫైవ్ స్టార్ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో కరెంట్ షాక్.. ఇద్దరు విదేశీయులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

