హైదరాబాద్, డిసెంబర్ 1(నమస్తే తెలంగాణ) : డిసెంబర్ తర్వాత బడుల్లో స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించవద్దని తెలంగాణ గెజిటెడ్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్ కోరింది. సోమవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్‌ను కలిసి విన్నవించింది. డిసెంబర్ తర్వాత పదో తరగతి స్పెషల్‌క్లాసులు, ఎఫ్ఎల్ఎన్, ఎఫ్ఎల్ఎస్ ఇతరత్రా కార్యక్రమాల్లో నిమగ్నం కావాల్సి వస్తున్నదందున డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు సమావేశాలను విరమించుకోవాలని అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాశ్, సలహాదారు పర్వతి సత్యనారాయణ కోరారు.
పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేయొద్దు : ఇందర్‌పాల్
హైదరాబాద్, డిసెంబర్ 1(నమస్తే తెలంగాణ) : అభివృద్ధి పేరిట పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేయడం కుదరదని కేంద్ర పర్యావరణ అటవీశాఖ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ చైర్మన్ ఇందర్పాల్సింగ్ మాథారు అన్నారు. పర్యావరణం, అభివృద్ధి రెండు కలిసి నడిచినప్పుడే సుస్థిర కోల్‌మైనింగ్, ప్రగతి సాధ్యమని తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో కోల్ మైనింగ్ -పర్యావరణ సుస్థిరతపై వర్క్‌షాప్‌లో ప్రసంగించారు. సమావేశంలో అప్రైజల్ కమిటీ సభ్యుడు సుందర్ రామనాథన్, సింగరేణి సీఎండీ ఎన్ బలరాం, పర్యావరణ శాస్త్రవేత్తలు లలిత్ కపూర్, ఉమేశ్ జగన్నాథరావు కహలేకర్, సంతోష్‌కుమార్ హంపన్నవార్ పాల్గొన్నారు.