హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ) : వైద్యారోగ్య శాఖలోని డీఎంఈ, డీహెచ్, టీవీవీపీ విభాగాల్లో పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. వైద్యారోగ్య శాఖ మంత్రి రాజనర్సింహను శనివారం హైదరాబాద్లో కలిసి వినతిపత్రం అందజేశారు. టీవీవీపీని పూర్తి స్థాయి ప్రభుత్వ శాఖగా మార్చాలని డిమాండ్ చేశారు. ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. కార్యక్రమంలో టీజీజీడీఏ అధ్యక్షుడు నరహరి, ప్రధాన కార్యదర్శి లాలూప్రసాద్ రాథోడ్, కోశాధికారి రవూఫ్, వైస్ ప్రెసిడెంట్ దీన్ దయాల్, సీఈసీ మెంబర్ రాజశేఖర్ పాల్గొన్నారు.