ఆర్థిక నేరాల కట్టడికి కలిసి పని చేయనున్న సీఎస్బీ, ఐఎస్బీ
హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరాలపై లోతైన పరిశోధన కోసం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ)తో సైబర్ సెక్యూరిటీ బ్యూరో(సీఎస్బీ) ఒప్పం దం చేసుకుంది. శనివారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో డీజీపీ జితేందర్, సీఎస్బీ డీజీ శిఖాగోయెల్, ఐఎస్బీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ మనీశ్ గంగ్వార్ ఎంవోయూపై సంతకాలు చేశారు. డీజీపీ మాట్లాడుతూ ఆర్థిక నేరాలకు అడ్డుకట్ట వేయడంలో, సాంకేతికతను మరింతగా ఉపయోగించుకోవడంలో ఐఎస్బీ, సీఎస్బీ కలిసి పనిచేస్తాయని తెలిపారు. ఏఐ వినియోగంపైనా దృష్టిసారిస్తాయని చెప్పారు. ఐఎస్బీ డీన్ ప్రొఫెసర్ మదన్ మాట్లాడుతూ సైబర్ సెక్యూరిటీతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉన్నదని వెల్లడించారు.