TG Weather Report | తెలంగాణలో రాగల ఆరురోజులు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాబోయే మూడురోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పింది. ఆదివారం నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వానలుపడే అవకాశం ఉందని పేర్కొంది.
సోమవారం మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపే, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వానలు కొనసాగుతాయని పేర్కొంది. మంగళవారం నుంచి శనివారం వరకు పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడుతాయని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ని జారీ చేసింది. ఇదిలా ఉండగా.. గడిచిన 24గంటల్లో జోగులాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట, వికారాబాద్, కామారెడ్డితో పాటు పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయని టీజీడీపీఎస్ వివరించింది.