హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ) : పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ పాలిసెట్ ఫలితాలు ఈ నెల 25న విడుదలకానున్నాయి. అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. మంగళవారం పాలిసెట్ పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. 1,06,716 మంది దరఖాస్తు చేసుకోగా 98,858 మంది పరీక్షకు హాజరైనట్టు సాంకేతిక విద్యామండలి కార్యదర్శి పుల్లయ్య ప్రకటనలో తెలిపారు. బాలురు 92.84%, బాలికలు 92.4% చొప్పున పరీక్షకు హాజరైనట్టు ఆయన వెల్లడించారు.
హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ) : ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపునకు అధికారులు మరో అవకాశం ఇచ్చారు. రూ. 2,500 ఆలస్య రుసుముతో బుధవారం సాయంత్రం వరకు ఫీజు చెల్లించే అవకాశం కల్పించారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు 22 నుంచి 29 వరకు జరగనున్నాయి.
హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ) : రెండేండ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎడ్సెట్ దరఖాస్తుల గడువును ఈ నెల 20 వరకు పొడిగించినట్టు కన్వీనర్ ప్రొఫెసర్ బీ వెంకట్రామ్రెడ్డి ప్రకటనలో తెలిపారు. ఆలస్య రుసుము లేకుండా అభ్యర్థులు ఈ నెల 20 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. జూన్ 1న ఎడ్సెట్ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు.