ఎల్ఎల్ఎం కోర్సుల్లోని సీట్ల భర్తీకి మొదటి విడత వెబ్ కౌన్సెలింగ్ ఆగసు ్ట25 నుంచి ప్రారంభంకానున్నది. విద్యార్థులు ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆగస్టు 27 నుంచి 29 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది.
సెప్టెంబర్ 3, 4న వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. సెప్టెంబర్ 5న వెబ్ ఆప్షన్లు ఎడిట్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 8న సీట్లు కేటాయిస్తారు. సెప్టెంబర్ 9 నుంచి 13 వరకు కాలేజీల్లో రిపోర్ట్చేయాలి. సెప్టెంబర్ 10 నుంచి క్లాసులు ప్రారంభమవుతాయి.