TG LAWCET | హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ) : లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీజీ లాసెట్ – 2025 ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. మాసాబ్ ట్యాంక్‌లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో చైర్మన్ వి బాలకృష్ణారెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ఎం కుమార్‌లు ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈసారి 66.46 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మహిళలు 62.49 శాతము.. పురుషులు 68.38 శాతం క్వాలిఫై అయ్యారు. లా సెట్ పరీక్షలను జూన్ 6న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన విషయం విదితమే.