TG Inter Supply Results | తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేసేందుకు బోర్డు రంగం సిద్ధం చేసింది. సమాధాన పత్రాల మూల్యాంకనాన్ని బోర్డు పూర్తి చేసింది. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం 2గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. మే 24 నుంచి జూన్ 3 వరకు ఇంటర్ అడ్వాన్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షకు దాదాపు దాదాపు 4.5లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫెయిల్ అయిన విద్యార్థులతో పాటు ఇంప్రూవ్మెంట్ కోసం రాసిన విద్యార్థులు సైతం ఉన్నారు. విద్యార్థుల ఫలితాల కోసం tgbie.cgg.gov.in, results.cgg.gov.in వెబ్సైట్లో సంప్రదించాలని బోర్డు కోరింది.