హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : టీజీఎడ్సెట్ ఫలితాలు మంగళవారం విడుదలకానున్నట్టు కన్వీనర్ ప్రొఫెసర్ మృణాళిని తెలిపారు.
2024-25 విద్యాసంవత్సరంలో రెండేండ్ల బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు మహత్మాగాంధీ వర్సిటీ మే 23న ఎడ్సెట్ నిర్వహించింది. మొత్తం 33,879 మందికి 29,463 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.