హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ) : పాలిటెక్నిక్, బీఎస్సీ గణితం కోర్సులు పూర్తిచేసిన వారికి బీటెక్ రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన టీజీ ఈసెట్లో ఈ ఏడాది 9,699 (64.4%) సీట్లు నిండాయి.
తుది విడత కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత 15,064 సీట్లుండగా, 5,365 సీట్లు నిండలేదు. ఇంజినీరింగ్లో 70.2%, ఫార్మసీలో 2.5% సీట్లు నిండాయి. ఫార్మసీలో 1,297 సీట్లుంటే కేవలం 32 మంది మాత్రమే చేరారు.