హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన టీజీ ఎప్సెట్ ఫలితాలు ఈనెల 25న విడుదలకానున్నాయి. పరీక్షలు ముగియడంతో ఫలితాల విడుదల చేయడంపై జేఎన్టీయూ అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు.
ఇప్పటికే ప్రాథమిక కీ విడుదల కాగా, తుదిగా ఖరారుచేసిన ఫలితాలను ప్రాసెస్ చేస్తారు. ఒకవేళ 25న వీలు కాకుంటే ఒక రోజు తర్వాత ఫలితాలను విడుదల చేసే ఆలోచన చేస్తున్నట్టు జేఎన్టీయూ వర్గాలు వెల్లడించాయి.