Inter Results | హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు ఈ నెల 13 లేదా 14న విడుదల కానున్నాయి. ఈ రెండు తేదీల్లో ఏదో ఒక రోజు ఫలితాలను విడుదల చేయాలని ఇంటర్‌బోర్డు భావిస్తున్నది. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ముగిసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మూల్యాకంనం కొనసాగుతున్నది. ఈ నెల 6వ తేదీతో ఈ మూల్యాకంనం పూర్తికానుంది. ఆ తర్వాత ప్రాక్టికల్స్, సహా ఇంటర్నల్స్ పరీక్షలను పూర్తిచేసి, ఈ నెల 13, 14 తేదీల్లో ఫలితాలు విడుదల చేయాలన్న ఆలోచనలో అధికారులున్నారు.