రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 11(నమస్తే తెలంగాణ): ‘రాష్ట్రంలో వసూలు చేసిన ప న్నుల్లో 70 శాతం కేంద్రం తీసుకుంటూ.. 30 శాతం మాత్రమే రాష్ట్రాలకు ఇస్తున్న ది.. కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ర్టాలే పోషిస్తున్నాయి’ అని రాష్ట్ర చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పేర్కొన్నారు. రేషన్ షాపుల్లో మోదీ ఫొటో పెట్టాలంటున్నవారు.. కేంద్రాన్ని పోషిస్తున్న అన్ని రా ష్ర్టాల ముఖ్యమంత్రుల ఫొటోలు పెడుతా రా.. అని ప్రశ్నించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని అప్పారెల్ పార్కులో 7.6 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన టెక్స్‌పోర్టు ఇండస్ట్రీస్ పంక్చుయేట్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్‌ను శుక్రవారం మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, విప్ ఆది శ్రీనివాస్‌తో కలిసి మంత్రి తుమ్మల ప్రారంభించారు. మంత్రి శ్రీధర్‌బాబు మా ట్లాడుతూ.. టెక్స్‌పోర్టు ప్రతినిధులతో చ ర్చించి, పరిశ్రమను ప్రారంభించే లా చర్య లు తీసుకున్నామని చెప్పారు. మంత్రి పొ న్నం మాట్లాడుతూ టెక్స్‌పోర్ట్ కంపెనీ ప్రా రంభించడం సంతోషంగా ఉందన్నారు.