హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తేతెలంగాణ): ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) హాల్‌టికెట్లు గురువారం విడుదల కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. 2 నుంచి 20 వరకు ఆన్లైన్లో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2.75 లక్షల మంది అభ్యర్థులు టెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు.