TET Exam | తెలంగాణలో టెట్ ఎగ్జామ్.. ఇన్ సర్వీస్ టీచర్ల కోసం స్పెషల్ టెట్
TET Exam | తెలంగాణలో ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల బోధనా అర్హత కోసం నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. 2026 విద్యా సంవత్సరానికిగాను సెప్టెంబర్ 8, 9 తేదీల్లో ఈ పరీక్షలను ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
TET Exam : తెలంగాణలో ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల బోధనా అర్హత కోసం నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. 2026 విద్యా సంవత్సరానికిగాను సెప్టెంబర్ 8, 9 తేదీల్లో ఈ పరీక్షలను ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక టెట్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 24,983 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్షలను ప్రతిరోజూ మూడు షిఫ్టుల్లో నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఉదయం 9:00 గంటల నుంచి 11:30 వరకు, మధ్యాహ్నం 2:00 గంటల నుంచి 4:30 వరకు వివిధ సెషన్లలో పరీక్షలు జరుగుతాయి.
సెప్టెంబర్ 8న పేపర్-1, పేపర్-2 (తెలుగు, ఇంగ్లీష్ మీడియం) పరీక్షలు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 9న మిగిలిన మాధ్యమాలకు సంబంధించిన పేపర్-2 పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ, సంబంధిత పాఠశాలల్లో పనిచేస్తూ.. ఇప్పటికీ నిర్దేశిత అర్హత ప్రమాణాలను సాధించని ఉపాధ్యాయుల కోసమే ఈ ప్రత్యేక టెట్ను నిర్వహిస్తున్నారు. హాల్ టికెట్లు, ఇతర పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ schooledu.telangana.gov.in సందర్శించాలని విద్యాశాఖ సూచించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

