హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత (TG TET) పరీక్షలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి. 17 జిల్లాల్లో 92 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రోజుకు రెండు సెషన్లలో ఎగ్జామ్స్ జరగనున్నాయి. 2, 5, 11, 12, 19, 20 తేదీల్లో పేపర్-2 పరీక్ష ఉంటుంది. 8, 9, 10, 18 తేదీల్లో పేపర్-1 పరీక్ష జరుగుతుంది. పరీక్షలకు 2,75,753 మంది దరఖాస్తు చేసుకోగా ఇందులో పేపర్-1కు 94,327 మంది, పేపర్-2కు 1,81,426 మంది అప్లయ్ చేశారు. పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే ఎగ్జామ్ సెంటర్ గేట్లు బంద్ చేయనున్నారు. అభ్యర్ధులకు ఏవైనా సమస్యలు ఎదురైతే 7032901383, 9000756178, 7075088812, 7075028881, 7075028882, 7075028885 నంబర్లను సంప్రదించాలని టెట్ ఛైర్మన్, పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నరసింహారెడ్డి సూచించారు.
ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు మొదటి సెషన్ పరీక్షలు నిర్వహించనున్నారు.
మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు రెండో సెషన్ పరీక్షలు జరగనున్నాయి.
రెండో సెషన్‌కు 12.30 గంటల నుంచి పరీక్ష కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతిస్తారు.
రెండో సెషన్‌కు మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేస్తారు.
పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ సహా ఇతర నిషేధిత వస్తువులకు అనుమతి లేదు.