ఆకునూరులో టెర్రకోట స్త్రీ శిల్పం
సిద్దిపేట జిల్లా చేర్యాల మం డలం ఆకునూరు గ్రామంలోని పాటిగడ్డమీద ఇక్షాకుల కాలం నాటి టెర్రకోట స్త్రీ శిల్పం లభించింది.
- ఇక్షాకుల కాలంనాటిదిగా నిర్ధారణ
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): సిద్దిపేట జిల్లా చేర్యాల మం డలం ఆకునూరు గ్రామంలోని పాటిగడ్డమీద ఇక్షాకుల కాలం నాటి టెర్రకోట స్త్రీ శిల్పం లభించింది. కొత్త తెలంగాణ చరిత్ర బృందానికి చెందిన కొలిపాక శ్రీనివాసుకు అది దొరికింది. ఈ శిల్పాన్ని పరిశీలించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ రామోజు హరగోపాల్ టెర్రకోట బొమ్మ తలపైనున్న ‘మకరిక’ శిరోజాలంకరణ, నుదిట చూడామని, చెవులకు కుండలాలు, కన్ను, ముక్కు తీరు నాగార్జునకొండ, కొండాపూర్లలో దొరికిన టెర్రకోట బొమ్మలనే పోలి ఉన్నదని తెలిపారు. ఈ బొమ్మను పరిశీలించిన చరిత్రకారుడు, స్థపతి ఈమని విశ్వనాగిరెడ్డి కూడా ఇక్షాకుల కాలందేనని నిర్ధారించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

