ఉట్నూర్, మార్చి 21 : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లో పదోతరగతి ఉర్దూ పేపర్ లీక్ జరగలేదని కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడారు. ఉట్నూర్లో రెండు రోజులుగా పదో తరగతి ఉర్దూ పేపర్ లీక్ అయినట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేసిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఇందుకు బాధ్యులైన ముబాషీర్, మహ్మద్ ఆసిఫ్, సయ్యద్ కైఫ్లపై కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.