హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ) : పదో తరగతి వార్షిక పరీక్షలు ముగిశాయి. సోమవారం సోషల్ స్టడీస్ పేపర్‌కు పరీక్ష నిర్వహించగా ప్రధాన పరీక్షలు ముగిశాయి. సంస్కృతం, అరబిక్ వంటి మైనర్ పేపర్లకు ఈ నెల 16 వరకు పరీక్షలు జరుగుతాయి.
సోమవారం నాటి పరీక్షకు 5,18,297 మందికి 5,16, 915 మంది విద్యార్థులు(99.73%)హాజరయ్యారు. పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం ముగింపునకు చేరుకున్నది. మే మొదటి వారంలో ఫలితాలు విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.