ఆసిఫాబాద్ : జిల్లా కేంద్రంలోని జనకాపూర్ రైతు వేదికలో గురువారం అధికారులు చేపట్టిన కొత్త రేషన్ కార్డుల (Ration cards)పంపిణీ వివాదానికి దారితీసింది. రేషన్ కార్డుల పంపిణీకి ముఖ్య అతిథిగా హాజరైన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి రేషన్ కార్డులు పంచుతుండగా..కాంగ్రెస్ పార్టీ ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇన్చార్జి శ్యాం నాయక్ కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వివాదం చోటుచేసుకుంది.
దీంతో ఆవేశానికిలోనైనా ఎమ్మెల్యే కోవలక్ష్మి టేబుల్ పైనున్న వాటర్ బాటిల్ ఇతర వస్తువులను శ్యాం నాయక్ పై విసిరి కొట్టారు. కేసీఆర్ దయతో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన రేఖా శ్యాం నాయక్ గెలిచిన విషయం మర్చిపోయి కనీసం కృతజ్ఞత భావం లేకుండా కేసీఆర్పై శ్యామ్ నాయక్ విమర్శలు చేయడంతో ఉత్రిక పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం నుంచి ఎమ్మెల్యే కోవలక్ష్మి వెళ్లిపోయారు.