చింతలపాలెం : పులిచింతల జెన్కో ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పులిచింతల జెన్కో ప్రాజెక్టులో వజినేపల్లి గ్రామానికి చెందిన కొందరు స్థానిక కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించినట్లు సమాచారం. దీనికి నిరసనగా బాధిత కార్మికుల కుటుంబ సభ్యులు ప్రాజెక్టు వద్ద ధర్నాకు దిగారు.
ధర్నా సందర్భంగా కొందరు తమపై పెట్రోల్ పోసుకుని ఆత్మాహత్యాయత్నానికి ప్రయత్నించారు.
దీంతో ఘటనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళన కారులను శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.