సూర్యాపేట : సూర్యాపేటలోని(Suryapet )ఇమామ్ పేట సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ పాఠశాల( Social Welfare Residential School) వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు సంబంధించిన 5 నుంచి 9వ తరగతి వరకు ఎస్సీ గురుకుల హాస్టల్ జరుగుతున్న స్పాట్ అడ్మిషన్లు(Spot admissions) గందరగోళంగా మారాయి. దీంతో తమ పిల్లలకు న్యాయం చేయాలని పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళకు దిగారు. గురుకుల పాఠశాలలో ఎన్ని సీట్లు ఉన్నాయో తెలపకుండా స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. 99 సీట్లు ఉంటే 3000 మందిని ఎందుకు పిలిచారని ప్రశ్నించారు.
ఉదయం 2 సీట్లే అన్నారు. మధ్యాహ్నం 45 అన్నారు.. ఆందోళన తరువాత 99 అంటున్నారు. అలాగే మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే లేటర్లు ఉన్నాయా అని గురుకుల సిబ్బంది అడుగుతున్నారంటూ తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫైరవీలు ఉంటేనే సీట్లు ఇస్తారా అంటూ నిలదీశారు. ఉదయం 8 గంటల నుంచి జ్వరం తో బాధపడుతున్న పిల్లలతో తిండితిప్పలు లేకుండా వస్తే సాయంత్రం అవుతున్నా క్లారిటీ ఇవ్వ కుం డా.. ఎలాంటి వివరాలు అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.