హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): సిరిసిల్లలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ కోసం శాశ్వత భవనాల నిర్మాణం వెంటనే ప్రారంభించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక ఎమ్మెల్యే కే తారకరామారావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్, జేఎన్టీయూ వీసీని కోరారు. తమ హయాంలో ప్రారంభించిన జేఎన్టీయూ సిరిసిల్ల ఇంజినీరింగ్ కాలేజీకి అవసరమైన శాశ్వత భవనాల నిర్మాణం చేపట్టే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
వేములవాడలోని డిగ్రీ కాలేజీలో కొనసాగుతున్న ప్రస్తుత తాతాలిక తరగతి గదులకు తాళం వేయడంతో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై పత్రికల్లో వచ్చిన వార్తను ఆయన సీరియస్‌గా తీసుకొని వెంటనే రంగంలోకి దిగారు. జేఎన్టీయూ వైస్ చాన్స్‌లర్ కిషన్కుమార్రెడ్డితోపాటు, సాంకేతిక విద్యా కమిషనర్‌కు శనివారం ఫోన్ చేసి మాట్లాడారు.
విద్యార్థులు ఇబ్బందులు పడకుండా చూడాలని, త్వరగా శాశ్వత భవనాలకు అనుమతులు ఇచ్చి పనులు ప్రారంభించాలని సూచించారు. అలాగే, స్థానిక అగ్రహారంలోని డిగ్రీ కాలేజీ అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చి జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలే జీ కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వెంటనే కాలేజీతో అవసరమైన ఒప్పందం చేసుకొని పెండింగ్‌లో ఉన్న అద్దె బకాయిలను చెల్లించేలా చూడాలని కోరారు. ఈ అంశంలో సానుకూలంగా స్పందించిన టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ వెంటనే పెండింగ్ బకాయిలను చెల్లించడంతోపాటు విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం 2021లో సిరిసిల్లలో జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీని మంజూరు చేసింది. దీని కోసం రూ.402 కోట్లు కేటాయించారు. మొదటి విద్యా సంవత్సరంలో 360 మంది విద్యార్థులతో తరగతులు ప్రారంభించారు. ప్రస్తుతం సుమారు 1,032 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో 700 మందికి హాస్టల్ వసతి కూడా కల్పించారు. కొత్త భవనం నిర్మాణం పూర్తయ్యే వరకు డిగ్రీ కాలేజీలో తాతాలికంగా తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే, కాలేజీ కమిషనర్ నుంచి తాతాలిక వసతి పొడిగింపు ఉత్తర్వులు రానందున, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ తరగతి గదులకు తాళం వేశారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకున్న కేటీఆర్ సంబంధిత అధికారులతో మాట్లాడారు. వెంటనే ఈ అంశంలో తగిన అనుమతులు, ఆదేశాలు స్థానిక డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌కు ఇవ్వాలని కేటీఆర్ సూచించారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ అధికారులు ఈ సమస్యను త్వరగా పరిషరించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఉన్నతాధికారులతో మాట్లాడిన కేటీఆర్‌కు విద్యార్థులు తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు.