హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా సాధారణ పగటి ఉష్ణోగ్రతలు ఘననీయంగా పెరిగాయి. అన్ని జిల్లాల్లో 30 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. 2 నుంచి 6 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదిలాబాద్ జిల్లాలో 36.5, భధ్రాద్రి-కొత్తగూడెం 35.6, హనుమకొండ, హైదరాబాద్ 34, ఖమ్మం 34.6, మహబూబ్నగర్ 36.1, మెదక్ 34.8, నల్లగొండ 31.5, నిజామాబాద్ 34.5, రామగుండంలో 34 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
వచ్చే వారం రోజులు వాతావరణం ఇలేగా ఉంటుందని అధికారులు తెలిపారు. కాగా, పసిఫిక్ మహా సముద్రం పరిసరాల్లో లీనినా తరహా వాతావరణం ఏర్పడిందని, దీంతో రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు.