మణికొండ, డిసెంబర్ 15: ప్రేమ, పెండ్లి పేరిట యువతిని మోసం చేసిన ప్రముఖ యూట్యూబర్ ను హైదరాబాద్‌లోని నార్సిం గి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. ‘యూట్యూబ్ చందుగాడు’ పేరుతో ఫేమస్ అయిన చంద్రశేఖర్ సాయికిరణ్ తన ఫేమ్‌ను ఉపయోగించుకొని నార్సింగికి చెందిన ఓ యువతితో ప్రేమ వ్యవహారం నడిపించాడు. 2021 ఏప్రిల్ 25న చంద్రశేఖర్ తన పుట్టిన రోజు వేడుకలకు యువతిని ఆహ్వానించి, పెండ్లి చేసుకుంటానని నమ్మించి, లైంగికదాడి చేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడితో పాటు అతని తల్లిదండ్రులు, మరో ఇద్దరిపై పలు సెక్షన్ల కింద పోలీసులకు కేసు నమోదు చేసి, చంద్రశేఖర్‌ను రిమాండ్‌కు తరలించారు.