Rural Literacy Rate | హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): గ్రామీణ మహిళ ల అక్షరాస్యతలో తెలుగు రాష్ర్టాలు అట్టడుగున నిలిచాయి. బీహార్, ఛత్తీస్గఢ్ కంటే ఆంధ్రప్రదేశ్, తెలంగా ణ వెనుకబడ్డాయి. 2023-24 సంవత్సరంలో ఏపీ కింది నుంచి మొ దటి స్థానంలో, తెలంగాణ కింది నుంచి రెండో స్థానంలో ఉన్నాయి. మొత్తం గ్రామీణ అక్షరాస్యత రేటు విషయంలోనూ తెలంగాణ, ఏపీ కింది నుంచి వరుసగా మొదటి, రెండో స్థానంలో నిలిచినట్టు ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశమంతా డిజిటల్ లిటరసీ వైపు పరుగులు తీస్తుంటే అక్షరాస్యత రేటు విషయంలో తెలుగు రాష్ర్టాలు వెనుకబడటం ఆందోళన కలిగిస్తున్నది. అక్షరాస్యతను పెంచేందుకు కేంద్రం న్యూ ఇండియా లిటరీస్ ప్రోగ్రామ్ను చేపట్టింది. పలు ఆశావహ జిల్లాలను గుర్తించి ఈ ప్రోగ్రామ్ను అమలు చేస్తున్నప్పటికీ ఫలితాలు రావడం లేదు.
కేంద్రం వివరాలు ఇవీ..